తెలుగు మరియు ఇతర భారత చిత్ర పరిశ్రమలు

భారతదేశంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమది ఒక ప్రత్ర్యేకమైన స్థానం. అన్ని చిత్ర పరిశ్రమలతోనే ఈ పరిశ్రమ కూడా ఎదిగింది. కాని ఈ మధ్య పరిశ్రమలో వస్తున్న మార్పులు కలవరపరుస్తున్నాయి. చలన చిత్ర పరిశ్రమకు ప్రజలను వినోద పరచడం ఎంత భాధ్యతో సమాజహిత భావాలను చేరవేయటం కూడా అంతే భాధ్యత. కాని సమాజంలో వస్తున్న మార్పుల అనుసారం తెలుగు పరిశ్రమ కూడా నలుగురితో నారాయణ అనే ఉంది. ప్రస్తుతం సమాజంలో ప్రజలు చలన చిత్రం పట్ల అందులోని ముఖ్యుల పట్ల చాలా తప్పుడి ఉద్దేశాలతో ఉన్నారు. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో కథానాయకులు ఒక నటీ నటుల స్థయినుండి హీరోల స్థాయికి ఎదిగిపోయారు. ఆ ఉద్దేశ్యము ఎంత దూరం వెళ్లింది అంటే నిజజీవితంలో ఒక సినిమా హీరోలా నటిస్తేనే తప్ప వారిని ప్రజలు పట్టించుకోవట్లేదు. దీని కోసం నటులు వెండితెర మీదనే కాకుండా ప్రజల్ని ఆకర్షించుకోవటానికి సామాజిక నిజజీవితంలో కూడా ఒక సినిమాలో వలే నటించ వలసి వస్తుంది. ఆ విధంగా చలన చిత్రంలో నటీ నటులకు ప్రజలు ఆకర్షింపబడ్డారు. వారుకూడా మనలాంటి మామ్ములు మనుష్యులే అన్న నిజాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. నటీనటుల పేర్లు చెప్పుకోని తిట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు. ఆయినాసరే ఇవన్నీ తెలిసినా ఒక్క కథానాయకుడియొక్క నోరూ పెగలడం లేదంటే అది అభిమనుల మీద భయమనే చెప్పాలి. "నేనూ అందరిలా మామ్మూలు నటుడనే. నటన నా వృత్తి. కేవలం వృత్తి ఆనందం కోసం, సంపాదన కోసం నటిస్తున్నాను" అన్న మాట ఒక నటుడి జీవితానికి తెర వేసేస్తుందనే చెప్పాలి. నిజం ఎంత బట్టబైలుగా ఉన్నా, నటన ఒక సమాజ సేవ అనే విధంగానే మాట్లాడాలి. ఒక సినిమా అంటే కథానాయకుడు లేదా కొన్నిసార్లు దర్శకుల పేరు మీద వచ్చి వెల్లుపోతుంటుంది మరియు ఆ విధంగానే ప్రజలు కూడా అనుసరిస్తున్నారు. ఇంత అక్షరారస్యత వచ్చినా ప్రజలలో సినిమాల పట్ల ఈ దోరని మారలేదు. మా హీరో, మా హీరో సినిమా. ఒక చలన చిత్రంలో కొన్ని వందల మంది పని చేస్తుంటారు. అందులో ఒక నటుడి పాత్ర ఎంత? ఒక గొప్ప నటుడు అని చెప్పటానికి ఏ విషయాలను పరిగణంలోకి తీసుకోవాలి? ఒక  సినిమాని ఒక నటుడి పేరు చెప్పుకొని కేవలం డబ్బుల ఆర్జనకోసం చిత్రం మొత్తం ఆ నటుడి గొప్పతనమే అనే విధంగా ప్రకటించడం ప్రచారం చేయడం ఎంత వరకూ సమంజసం?

ఇక నటి అన్న విషయానికి వస్తే, చాలావరకు భారత చిత్రాలలో కేవలం కథానాయకుడిని ప్రేమలో పడేయటానికి, ప్రేక్షకులకు తన అందాలను చూపించటానికి తప్పితే వేరొక పాత్ర వారికి దక్కటలేదు. ఒకవైపు దేశంలో స్త్రీల యొక్క జీవితంలో మర్పు తీసుకు రావటానికి ఎన్ని విశ్వప్రయత్నాలు చేస్తున్నా, ఒక్క చలనచిత్రంలో కధానాయికను చూస్తే స్త్రీల మార్పు అన్న ప్రేరేపన మొత్తం పోయి, ఏ విధంగా అంత అందమైన, తెలివైన, అందరూ కావాలనుకొనే అమ్మయిని ప్రేమించాలి, పెళ్ళిచేసుకోవాలి, శృగారం చేయాలి అన్న ఆలోచనలు సాధారన మనిషి బుర్రలో నింపివేస్తాయి. అడపాదడపా మంచి ఉధ్యేశాలతో, విలువలతో, నైపున్యంతో ఒక చిత్రం తీసినా దానికి వచ్చే ప్రజాధరన బాణాసంచా వలే ఒక్క క్షణం పేలి వెంటనే ఆరిపోతుంది. ఇప్పుడు వస్తున్న పోటీతత్వం వలనో లేక ఇతరేతర కారణాలవలనో దక్షణ భారతదేశంలో చాలా మంచి సినిమాలు వస్తున్నాయి కాని అందులో తెలుగు సినీపరీశ్రమ మినహాయింపు. కథానయకులని చెప్పుకుంటున్న ప్రతిఒక్కరు వివిధ పాత్రలు పోషించి వారువారి నటనా నైపుణ్యాన్ని చాతుకుంటున్న ఈ రోజుల్లో తెలుగు సినీ పరిశ్రమలో ఇంక పాత దోరణే కనబడుతుంది. గత పది సంవత్సరాలుగా తెలుగు చిత్రలు దాదాపుగా ముఖ్య కథానయకులు ప్రేక్షకులు వారిని ఏ విధంగా చూడాలనుకుంటుంన్నారో అటువంటి భలమైన వీరపరాక్రమమైన పత్రలలో తప్ప వేరొక పాత్రలకు ససేమిరా అంటున్నారు. నిజజీవితంలో కూడా హీరోలవలే మట్లాడటం వారి మనోభావాల పరాకాష్ట. ఏదేమైనా భారతీయ చిత్రపరిశ్రమలో మౌలిక మార్పులు మరియు చలన చిత్రాల పట్ల ప్రజల ఆలోచనా దోరణీ మారడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా ఒక చిత్రంలో ఒక నటుడికి, నటికి సమానమైన హోదా మరియు ముఖ్యత్వం, ప్రజలకు ఒక మంచి విషయం తెలుయపరచటానికో, లేదా ఒక కళను ప్రదర్శించటానికో సినిమా ఒక వేదిక అయితే నాటకరంగం మరియు సాంకేతిక అభినందన రెండూ పెరుగుతాయి.

Comments

Popular posts from this blog

One Important thing that India lacks to develop

India: A rich country with poor people

Microsoft Indic Language Input Tool free download